త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక
విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఆదిమూలం శ్రీనివాస్ మేరు
నల్లగొండ నగర మేరు సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
నల్లగొండ, ఆగస్టు 17 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): విధి నిర్వహణలో ఒక వ్యక్తిని కాపాడటమే కాకుండా, ఆ కుటుంబానికి పెద్ద భరోసా, బలాన్ని చేకూర్చిన ఆదిమూలం శ్రీనివాస్ మేరు సేవలను ప్రభుత్వం గుర్తించి అభినందించింది. ఈ సందర్భంగా నల్లగొండ నగర మేరు సంఘ భవనంలో సంఘం కమిటీ సభ్యులు ఆదిమూలం శ్రీనివాస్ మేరును శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సమాజానికి ఆదిమూలం శ్రీనివాస్ మేరు సూచనలు
ఈ సందర్భంగా ఆదిమూలం శ్రీనివాస్ మేరు మాట్లాడుతూ సమాజంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యంగా డిగ్రీ, బీటెక్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగుతుందని తెలిపారు. ఆడపిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలని, యువత తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సేవలను అభినందించిన మేరు సంఘం
ఆదిమూలం శ్రీనివాస్ మేరు విధి నిర్వహణలో చూపిన ధైర్యం, మానవత్వాన్ని సంఘం సభ్యులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడటంతో పాటు ఆయన కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ జటగిరి శంకరదాసమయ్య మేరు ఫొటోతో ఆదిమూలం శ్రీనివాస్ మేరుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ మేరు, జిల్లా ఉపాధ్యక్షులు మునగాల శంకర్ మేరు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు రేణిగుంట్ల నరేందర్ (రిటైర్డ్ టీచర్) మేరు (సూర్యాపేట), మాజీ అధ్యక్షులు తాడూరి రమేష్ మేరు, నల్లగొండ నగర అధ్యక్షులు నామ రాంప్రసాద్ మేరు, ఉపాధ్యక్షులు పానుగంటి కిరణ్ కుమార్ మేరు, టంగుటూరి సుధాకర్ మేరు, పానుగంటి యాదగిరి మేరు, కార్యదర్శులు అడప నరసింహ మేరు, వాడపల్లి రామ్ కుమార్ మేరు, కార్యవర్గ సభ్యులు వెంపటి జగన్, కొక్కు ఆంజనేయులు, బొడ్డు వేణుగోపాల్, రేణిగుంట్ల సుధీర్, సిద్ధనూరు విక్రం, బంధువులు, ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.