సర్వీసింగ్ పేరుతో వినియోగదారుల నమ్మకానికి గండి..?

కారు సీటు మార్చేశారా.. లేక నిర్లక్ష్యంగా అమర్చారా..? వినియోగదారుల భద్రతకు ఎవరు బాధ్యత..? ఫిర్యాదులపై కంపెనీ స్పందిస్తుందా..?

సర్వీసింగ్ పేరుతో వినియోగదారుల నమ్మకానికి గండి..?

నల్లగొండ/హైదరాబాద్, జూలై 10 (త్రినేత్ర ట్రూత్‌లైన్): వాహనం సర్వీసింగ్ కోసం షోరూంకు అప్పగిస్తే అదే స్థితిలో, నాణ్యతతో తిరిగి అందించాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుంది. కానీ హైదరాబాద్ రోడ్, చెర్లపల్లిలోని మారుతి సుజుకి షోరూంలో సర్వీసింగ్ చేయించిన అనంతరం కారు వెనుక సీటు మార్చి, నిర్లక్ష్యంగా అమర్చారని ఓ వినియోగదారు ఆరోపించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, సర్వీసింగ్ అనంతరం వాహనాన్ని పరిశీలించగా వెనుక సీటు సరిగా అమర్చకపోవడం, ఫిట్టింగ్ ప్లేట్లు, బోల్టులు బయటకు కనిపించడం, అసలు అమరికలో మార్పులు కనిపించాయని తెలిపారు. ఈ విషయాన్ని షోరూం సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. వినియోగదారుల ప్రశ్నలు ఇవే… * సర్వీసింగ్‌కు ఇచ్చిన వాహనంలోని భాగాల్లో మార్పులు చేస్తే యజమానికి ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు..? * సీటు అమరికలో నాణ్యతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు..? * వాహనాన్ని కస్టమర్‌కు అప్పగించే ముందు తుది నాణ్యత తనిఖీ చేశారా..? * ప్రయాణికుల భద్రతకు భంగం కలిగితే బాధ్యత ఎవరు వహిస్తారు..? వాహనాల సర్వీసింగ్‌లో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు. సర్వీసింగ్ పేరుతో నిర్లక్ష్యం జరిగితే అది కేవలం అసౌకర్యమే కాకుండా ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే సంబంధిత షోరూం యాజమాన్యం ఈ ఘటనపై వెంటనే స్పందించి వాస్తవాలను వెల్లడించడంతో పాటు ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. గమనిక: ఈ కథనం బాధిత వినియోగదారు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. సంబంధిత మారుతి సుజుకి షోరూం యాజమాన్యం వివరణ వెలువడాల్సి ఉంది.

11 Jul 2026 By PERIKA ABHILASH

సర్వీసింగ్ పేరుతో వినియోగదారుల నమ్మకానికి గండి..?

కారు సీటు మార్చేశారా.. లేక నిర్లక్ష్యంగా అమర్చారా..? వినియోగదారుల భద్రతకు ఎవరు బాధ్యత..? ఫిర్యాదులపై కంపెనీ స్పందిస్తుందా..?

https://www.epaperthrinethratruthline.co.in/telangana/customer-trust-in-the-name-of-servicing/article-152
Views: 28
Tags:

About The Author

PERIKA ABHILASH Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Latest News

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ...
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక