నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికలు.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

జిల్లా అధ్యక్ష పదవికి బోనగిరి సురేందర్ మేరు, ప్రధాన కార్యదర్శి పదవికి గుంటి రామకృష్ణ మేరు నామినేషన్

నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికలు.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

నల్లగొండ, జూలై 9 (త్రినేత్ర ట్రూత్‌లైన్): నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి బోనగిరి సురేందర్ మేరు, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి గుంటి రామకృష్ణ మేరు నామినేషన్లు సమర్పించారు. అలాగే నల్లగొండ నగర ఉపాధ్యక్ష పదవికి కొత్తకొండ నరసింహ మేరు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం నల్లగొండ నగరానికి చెందిన మేరు సంఘం సభ్యులు, పెద్దలు అభ్యర్థులను అభినందించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. మేరు సంఘాన్ని మరింత బలోపేతం చేసి సామాజిక, సంఘ సంక్షేమ కార్యక్రమాలను విస్తరించాలని ఆకాంక్షిస్తూ తమ మద్దతు ప్రకటించారు. ఎన్నికల సహాయ అధికారి గుంటి నరేందర్ (టీచర్) సమక్షంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా, నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూలై 8 నుంచి 15 వరకు నామినేషన్ల స్వీకరణ, జూలై 16న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ నిర్వహించనున్నారు. జూలై 19 (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంఘ ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

09 Jul 2026 By konda abhinav

నల్లగొండ జిల్లా మేరు సంఘం ఎన్నికలు.. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

జిల్లా అధ్యక్ష పదవికి బోనగిరి సురేందర్ మేరు, ప్రధాన కార్యదర్శి పదవికి గుంటి రామకృష్ణ మేరు నామినేషన్

https://www.epaperthrinethratruthline.co.in/telangana/nallagonda-district-community-elections-candidates-filed-nominations/article-151
Views: 237
Tags:

About The Author

Latest News

త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ...
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక
త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక