16/10/2026 త్రినేత్ర ట్రూత్లైన్ తెలుగు దినపత్రిక
నల్లగొండ జిల్లా ఎంఈఎఫ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
జిల్లా అధ్యక్షుడిగా వడ్డే రాజు.. నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు చేబర్తి యాదగిరి
నల్లగొండ, అక్టోబర్ 15 (త్రినేత్ర ట్రూత్లైన్ ): నల్లగొండ జిల్లాలో ఎంఈఎఫ్ నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మామిడి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చేబర్తి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ మంద దేవేందర్ ప్రసాద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ మల్లేపాక వెంకన్న, శ్రీ జాన్ విల్సన్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి శ్రీ వల్లంపట్ల కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవరపాలెం ప్రభాకర్, జాతీయ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ ఆడెపు జానయ్య, జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ లంకపల్లి నగేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ రేగూరి రాము, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ వస్కుల సత్యనారాయణ, మాజీ రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ బొజ్జ వేణుగోపాల్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్డే రాజు తదితరులు హాజరయ్యారు.
జిల్లా, డివిజన్, మండల స్థాయిలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విస్తృత చర్చల అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన జిల్లా కార్యవర్గం
- జిల్లా అధ్యక్షుడు: శ్రీ వడ్డే రాజు
- కార్యనిర్వాహక అధ్యక్షులు: శ్రీ పులికంటి భాస్కర్, శ్రీ చింత యాదగిరి
- ప్రధాన కార్యదర్శి: శ్రీ చింత ఎల్లయ్య
- కోశాధికారి: శ్రీ తాటిపాముల సైదులు
- అదనపు ప్రధాన కార్యదర్శి: శ్రీ జీడిమడ్ల రమేష్
- ఉపాధ్యక్షులు: శ్రీ గుండ్లపల్లి నాగరాజు, శ్రీ మతికోటేశ్వరి, శ్రీ బొంగరాల సాగరయ్య, శ్రీ దైద వీరు
- సంయుక్త కార్యదర్శులు: శ్రీ మైనం ఉషయ్య, శ్రీమతి జ్యోతి
- వ్యవస్థాపక కార్యదర్శులు: శ్రీ మామిడి లింగస్వామి, శ్రీ శేఖర్, శ్రీ ఇంజమూరి సైదులు, శ్రీ చిటిపాక శ్రీను
నూతన జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చేబర్తి యాదగిరి అధికారికంగా ప్రకటించారు.
జాతీయ స్థాయిలో నూతన నియామకాలు
సంఘం జాతీయ స్థాయిలో కూడా పలువురికి నూతన బాధ్యతలు అప్పగించడంతో పాటు కొందరి హోదాలను ఉన్నతీకరించారు.
- జాతీయ ఉపాధ్యక్షుడు: శ్రీ వస్కుల సత్యనారాయణ
- జాతీయ సంయుక్త కార్యదర్శి: శ్రీ లంకపల్లి నగేష్
- జాతీయ వ్యవస్థాపక కార్యదర్శి: శ్రీ బొజ్జ వేణుగోపాల్
- జాతీయ కార్యవర్గ సభ్యులు: శ్రీ గట్టు మల్లయ్య, శ్రీ ఎర్ర వెంకటనారాయణ
నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులకు, జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టిన నాయకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం బలోపేతానికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
