పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజీలు చూడండి!

పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజీలు చూడండి!

ఆధ్యాత్మిక యాత్రలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లు, విమాన ప్యాకేజీలు

నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు నాలుగు భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్రలు

నల్లగొండ నవంబర్ 03 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి): పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్రలతో పాటు విమాన పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 27 వరకు నాలుగు ప్రత్యేక రైలు యాత్రలను నిర్వహించనున్నట్లు ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ పి.వి. వెంకటేశ్వర్లు తెలిపారు.


ప్రత్యేక రైలు యాత్రలు:
  1. సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర (SCZBG68): నవంబర్‌ 10 నుంచి 20 వరకు. ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌, ద్వారక, సోమనాథ్‌, నాసిక్‌ తదితర పుణ్యక్షేత్రాల సందర్శన. టికెట్‌ ధరలు స్లీపర్‌ రూ.18,000, 3ఏసీ రూ.27,400, 2ఏసీ రూ.35,500.
    2. దివ్య దక్షిణ భారత్‌ యాత్ర (SCZBG69): నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 1 వరకు. దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన. టికెట్‌ ధరలు స్లీపర్‌ రూ.15,800, 3ఏసీ రూ.23,200, 2ఏసీ రూ.29,600.
    3. అయోధ్య–కాశీ–బ్రహ్మనాథ్‌ ధామ్‌ దర్శన్‌ యాత్ర (SCZBG70): డిసెంబర్‌ 5 నుంచి 14 వరకు. పూరీ, కోణార్క్‌, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాల సందర్శన. టికెట్‌ ధరలు స్లీపర్‌ రూ.17,000, 3ఏసీ రూ.26,400, 2ఏసీ రూ.34,400.
    4. సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర (SCZBG71): డిసెంబర్‌ 17 నుంచి 27 వరకు. టికెట్‌ ధరలు స్లీపర్‌ రూ.18,000, 3ఏసీ రూ.27,400, 2ఏసీ రూ.35,500.
       ఈ రైలు యాత్రలు సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతాయని, మార్గమధ్యంలోని ఎంపిక చేసిన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కే సదుపాయం ఉంటుందని తెలిపారు.
       విమాన పర్యాటక ప్యాకేజీలు: హైదరాబాద్‌ నుంచి కాశీ, అండమాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, నేపాల్‌ ప్రాంతాలకు ప్రత్యేక విమాన ప్యాకేజీలను కూడా ప్రకటించారు. వీటి ధరలు ప్యాకేజీని బట్టి రూ.34,050 నుంచి రూ.67,750 వరకు ఉన్నాయి. అయోధ్య ప్రత్యేక విమాన ప్యాకేజీ ధర రూ.84,100గా నిర్ణయించారు.
       యాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్‌ కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9701360701, 9281030744, 9281030734, 9281030727, 9281030759 నంబర్లను సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
Views: 4
Tags:

About The Author

Related Posts