నల్గొండ క్రైమ్ న్యూస్
వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ అవినీతి అధికారులు అరెస్ట్
14 మంది అరెస్ట్
ఇద్దరు పరారి
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి సహా 14 మంది అరెస్ట్ మోసానికి సహకరించిన బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అరెస్ట్ – రూ.5 లక్షల నగదు స్వాధీనం..
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, IPS
Cr. No 299/2026 u/s 318(4),336(3),338,340,(2),61(2),212a, 236,237 BNS 65 IT Act, sec 36 Adhar atc sec 25/reg of Brith & Death of 1 Town police station.
త్రినేత్ర ట్రూత్‌లైన్, నవంబర్ 08, నల్గొండ, ప్రతినిధి:
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు తయారు చేసి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన మోసపూరిత వ్యవహారాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS తెలిపారు.
నిందితుల వివరాలు:
1).చామకూరి వసంత, భర్త వెంకటేశ్వర్లు, వయస్సు 55 సంవత్సరాలు, గౌడ, గృహిణి, శివాజీనగర్, నకిరేకల్.
2).చామకూరి రాజు, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు 21 సంవత్సరాలు, గౌడ, విద్యార్థి, శివాజీనగర్, నకిరేకల్.
3).చామకూరి రాజశేఖర్, తండ్రి రాములు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో AO ( *పరారీలో* ).
4).చామకూరి రవీందర్, తండ్రి రాములు, హెల్త్ అసిస్టెంట్, PHC కేతేపల్లి ( *పరారీలో* ).
5).కంచర్ల జగన్నాధ రెడ్డి, తండ్రి పాపిరెడ్డి, వయస్సు 60 సంవత్సరాలు, సీనియర్ అసిస్టెంట్, PHC శాలిగౌరారం, నల్లగొండ.
6).రాచకొండ వెంకటేశ్వర్లు @ వెంకట్ గౌడ్, తండ్రి రింగయ్య, వయస్సు 60 సంవత్సరాలు, వ్యవసాయం, ఒగోడు గ్రామం, నకిరేకల్ మండలం.
7).డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప, భర్త యంగాల రవికుమార్, వయస్సు 40 సంవత్సరాలు, మెడికల్ ఆఫీసర్, PHC శాలిగౌరారం, హైదరాబాద్.
8).పనస చంద్రశేఖర్ @ చందు, తండ్రి పెంటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, చందు మీ సేవ నిర్వాహకుడు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం.
9).కట్ల సతీష్, తండ్రి పరంధాములు, వయస్సు 44 సంవత్సరాలు, కంప్యూటర్ ఆపరేటర్, 12వ బెటాలియన్ TGSP, అన్నెపర్తి, నల్లగొండ.
10).ముక్కముయిల శివ జనార్ధన్, తండ్రి కొండయ్య, వయస్సు 30 సంవత్సరాలు, వార్డు ఆఫీసర్, శ్రీకృష్ణనగర్, నల్లగొండ.
11).ఎన్. ప్రదీప్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్.
12).పోలె రంజిత్ కుమార్, తండ్రి డేవిడ్, వయస్సు 33 సంవత్సరాలు, జూనియర్ అసిస్టెంట్ కమ్ CC to DMHO, నల్లగొండ.
13).నాగిరెడ్డి జితేందర్ రెడ్డి, తండ్రి జనార్ధన్ రెడ్డి, వయస్సు 56 సంవత్సరాలు, ఆఫీస్ సూపరింటెండెంట్, DMHO కార్యాలయం, నల్లగొండ.
14).మహబూబ్ అలీ, తండ్రి రంజాన్ అలీ, వయస్సు 59 సంవత్సరాలు, AO, DMHO కార్యాలయం, నల్లగొండ.
15)).గింకల రాకేష్ యాదవ్, తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు 33 సంవత్సరాలు, సీనియర్ అసిస్టెంట్, DMHO కార్యాలయం, నల్లగొండ.
16).తుంగతుర్తి మోహన్ కృష్ణ, తండ్రి శ్రీనివాసాచారి, వయస్సు 29 సంవత్సరాలు, జూనియర్ అసిస్టెంట్, DMHO కార్యాలయం, నల్లగొండ.
*నేరానికి సంబంధించిన వాస్తవాలు* :
నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 31-05-2025న పదవీ విరమణ పొందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ 17-11-2025న సాయంత్రం 5.10 గంటలకు మరణించారు. అనంతరం 26-11-2025న ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలం ఒగోడులో దశదిన కర్మలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మృతుడి సహోద్యోగులు, బంధువులు హాజరయ్యారు. వారిలో శాలిగౌరారం PHC సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, మృతుడి బంధువులైన చామకూరి రాజశేఖర్, చామకూరి రవీందర్ తదితరులు ఉన్నారు.
*మోసానికి పన్నిన కుట్ర* :
మృతుడు వెంకటేశ్వర్లు ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తే, ఆయన కుమారుడైన చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని నిందితులు పథకం రచించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కలిసి కుట్రకు పాల్పడ్డారు.
ఈ పథకంలో భాగంగా PHC శాలిగౌరారం సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి, మృతుడి బంధువులైన చామకూరి రాజశేఖర్ (మీ సేవా AO), చామకూరి రవీందర్ (హెల్త్ అసిస్టెంట్, PHC కేతేపల్లి), రాచకొండ వెంకటేశ్వర్లు @ వెంకట్ గౌడ్, మృతుడి భార్య చామకూరి వసంత, కుమారుడు చామకూరి రాజుతో కలిసి ప్రణాళిక రూపొందించారు.
ఈ వ్యవహారంలో నల్లగొండ DMHO కార్యాలయంలో పనిచేస్తున్న CC పోలె రంజిత్ కుమార్‌ను సంప్రదించి, మృతుడి భార్య వసంతతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
*ఆధార్ చిరునామా మార్పు – నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం తయారీ*
మృతుడి బంధువులైన రాజశేఖర్, రవీందర్ సమన్వయంతో నల్లగొండలోని మీ సేవా కేంద్రం నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ @ చందు ద్వారా మృతుడి ఆధార్ కార్డులో చిరునామాను మార్చారు. నల్లగొండ పట్టణంలోని DVK రోడ్డులో చైతన్యపురి కాలనీ, వార్డు నంబర్ 10, ఇంటి నంబర్ 500/1లో నివసిస్తున్నట్లు తప్పుడు చిరునామా నమోదు చేయించారు.
ఈ తప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా చామకూరి వెంకటేశ్వర్లు 28-05-2025న విధుల్లో ఉండగానే మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు.
ఈ ప్రక్రియలో మృతుడి మేనల్లుడు, TGSPలో ఉద్యోగిగా పనిచేస్తున్న కట్ల సతీష్‌కు విషయం తెలియజేసి దరఖాస్తు ఫారంపై సాక్షిగా సంతకం చేయించారు. అలాగే తమ కుట్ర గురించి పూర్తి వివరాలు తెలియజేయకుండా నక్రేకంటి సైదులు గౌడ్, నక్రేకంటి అశోక్‌లతో కూడా సంతకాలు చేయించినట్లు విచారణలో వెల్లడైంది.
మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివ జనార్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, మీ సేవా AO రాజశేఖర్, మీ సేవా కేంద్ర నిర్వాహకుడు చందు తదితరులు పరస్పరం కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
*వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల పాత్ర* :
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా మృతుడి కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించేందుకు శాలిగౌరారం PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప తన సంతకంతో సంబంధిత దరఖాస్తు ఫైలును DMHO కార్యాలయానికి పంపించారు.
అనంతరం DMHO కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ తుంగతుర్తి మోహన్ కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ జితేందర్ రెడ్డి, CC పోలె రంజిత్ కుమార్, శాలిగౌరారం PHC సీనియర్ అసిస్టెంట్ జగన్నాధ రెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులతో కుమ్మక్కై, తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి DMHOకు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ తప్పుడు పత్రాల ఆధారంగా మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.
*పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
నగదు – రూ.5,00,000.
ఒక కంప్యూటర్.
ఒక ప్రింటర్.
12 సెల్ఫోన్లు.
మృతుడు చామకూరి వెంకటేశ్వర్లు ఫొటో.
*మోసం వెలుగులోకి వచ్చిన విధానం – పోలీసుల దర్యాప్తు* :
నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 04-11-2026న నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తొలుత వన్ టౌన్ ఎస్ఐ జి. ముత్తయ్య దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ వన్ టౌన్ ఇన్చార్జ్ సీఐ కె. ఆది రెడ్డి, నల్లగొండ రూరల్ ఎస్ఐ బి. శివప్రసాద్, నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ డి. సైదాబాబు, వన్ టౌన్ ఎస్ఐలు ఎన్. వెంకట్ నారాయణ, జె. సైదులు మరియు ఇతర పోలీసు సిబ్బంది సమన్వయంతో దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని ఛేదించారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.
