13/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక

13/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక


శ్రీనగర్ కాలనీలో సెల్ టవర్ నిర్మాణాన్ని 
జిల్లా కలెక్టర్‌కు కాలనీవాసుల వినతి 


నల్లగొండ, అక్టోబర్ 12 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): నల్లగొండ పట్టణంలోని 19వ డివిజన్, శ్రీనగర్ కాలనీ, ఫేజ్‌–4, రోడ్ నంబర్‌–18లో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అంధజేశారు. కాలనీవాసుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించాలని కోరారు.
కాలనీలో ఇప్పటికే మూడు సెల్ టవర్లు ఉన్నాయని, మరో టవర్ నిర్మాణానికి ప్రయత్నాలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం వల్ల తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, సంబంధిత నిబంధనల ప్రకారం అధికారులు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, విప్లవ్ కుమార్, యాదగిరి కుమారుడికి సంబంధించిన నివాస భవనంలో నిర్మాణ అనుమతులు, నీటి సరఫరా బిల్లులు తదితర అంశాలపై కూడా పరిశీలన జరపాలని కాలనీవాసులు కోరారు. సదరు భవనానికి సంబంధించిన అనుమతులు, పత్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
సెల్ టవర్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిబంధనలపై సమగ్ర విచారణ జరిపి, విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలని కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
– శ్రీనగర్ కాలనీ వాసులు, 19వ డివిజన్, ఫేజ్‌–4, రోడ్ నంబర్‌–18, నల్లగొండ.

Views: 77
Tags:

About The Author

Related Posts