22/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక
On
మాజీ ఎంపీటీసీ చెరిపల్లి కైలాసం మృతి బాధాకరం
బీఆర్ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ నివాళి
కొండమల్లేపల్లి, అక్టోబర్ 22 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ): మాజీ ఎంపీటీసీ చెరిపల్లి కైలాసం మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో చెరిపల్లి కైలాసం మృతి చెందిన విషయం తెలుసుకున్న రామావత్ రమేష్ నాయక్ ఆయన స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాసేవకు అంకితమైన మంచి వ్యక్తి చెరిపల్లి కైలాసం అని కొనియాడారు. ఆయన మృతి స్థానికంగా తీరని లోటని, ప్రజలతో మమేకమై సేవలందించిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Views: 2
Tags:
About The Author
Related Posts
Latest News
09 Nov 2026 07:55:17
వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ అవినీతి అధికారులు అరెస్ట్ 14 మంది అరెస్ట్ ఇద్దరు పరారి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి...
