12/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక
On
విద్యార్థులఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీఆర్‌ఏఓయూలో అత్యధిక ప్రవేశాలు రావాలి: డాక్టర్ బి. ధర్మ నాయక్
ఈ నెల 13తో డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల గడువు ముగింపు
నల్లగొండ (త్రినేత్ర ట్రూత్‌లైన్): ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యేలా కృషి చేయాలని నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ సూచించారు. 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 13 చివరి తేదీ అని తెలిపారు.
బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీతోపాటు పలు నూతన పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశాల పెంపునకు అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, భూక్యా వీరన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Views: 20
Tags:
About The Author
Related Posts
Latest News
09 Nov 2026 07:55:17
వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ అవినీతి అధికారులు అరెస్ట్ 14 మంది అరెస్ట్ ఇద్దరు పరారి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి...
