13/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక

13/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక

నల్గొండలో అట్టహాసంగా ‘మనోరమ రెస్టారెంట్’ ప్రారంభం

నల్గొండ, అక్టోబర్ 12 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మనోరమ రెస్టారెంట్’ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమేర్ అలీ తదితరులు రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుమ్మల జానకి మోహన్ రెడ్డి, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, నాయకులు వంగూరు లక్ష్మయ్య, దొనాల నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆధునిక వసతులతో నాణ్యమైన సేవలు
ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారుల సౌకర్యార్థం అన్ని రకాల ఆధునిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ, నగర ప్రజలకు అనుకూలమైన ధరల్లో మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి హాజరై తమను అభినందించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు, పట్టణ ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

Related Posts