12/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక

12/10/2026 త్రినేత్ర ట్రూత్‌లైన్ తెలుగు దినపత్రిక

హాకీలో రాష్ట్రస్థాయికి జేబీఎస్‌ పాఠశాల విద్యార్థులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా పోటీల్లో ప్రతిభ.. పది మంది విద్యార్థులకు ఎంపిక

నల్లగొండ | 11-10-2026 | త్రినేత్ర ట్రూత్‌లైన్ | ప్రతినిధి

హాకీ క్రీడలో ప్రతిభ కనబరిచిన నల్లగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నల్లగొండలోని మేకల అభినవ్‌ క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య హాకీ పోటీల్లో ప్రతిభ చూపి ఈ అవకాశం దక్కించుకున్నారు.

అండర్‌–14 బాలుర విభాగం: మహమ్మద్‌ సిద్ధిక్‌, మహమ్మద్‌ అర్ఫాన్‌, జాన్సన్‌ ఎంపికయ్యారు.

అండర్‌–14 బాలికల విభాగం: జారా అంజుం, ఆసియా ఎంపికయ్యారు.

అండర్‌–17 బాలుర విభాగం: మహమ్మద్‌ రెహన్‌, మహమ్మద్‌ ఆతీఫ్‌ ఎంపికయ్యారు.

అండర్‌–17 బాలికల విభాగం: జె. సిరి, వి. ద్రాక్షిత, చిత్రలేఖ, పూజిత రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

హాకీలో శిక్షణ పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. రామకృష్ణ, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు మహమ్మద్‌ అలీమ్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రానున్న రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Views: 4
Tags:

About The Author

Related Posts