ఘనంగా గ్యారల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గ్యారల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గ్యారల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 5 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు, జీఎస్ సేవాసమితి చైర్మన్ గ్యారల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పసుమాముల పరిధిలోని స్వర్ణ మహల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శ్రీనివాస్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ప్రజా సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం గ్యారల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొనడంతో స్వర్ణ మహల్‌లో పండుగ వాతావరణం నెలక

Views: 4
Tags:

About The Author

Related Posts