30/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
On
హలో బహుజన.. చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలి
బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కామేపల్లి సైదులు
డిండి మండలంలోని పలు గ్రామాల్లో పోస్టర్ ఆవిష్కరణ
దేవరకొండ, సెప్టెంబర్ 30 (త్రినేత్ర ట్రూత్‌లైన్): బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ నిర్మాత మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9, 2026న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘హలో బహుజన.. చలో హైదరాబాద్’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కామేపల్లి సైదులు పిలుపునిచ్చారు. సభకు పెద్ద సంఖ్యలో బహుజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండలంలోని వివిధ గ్రామాల్లో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పోస్టర్లను ఆవిష్కరించారు. కాన్షీరాం ఆశయాలు, బహుజన సమాజ అభ్యున్నతి కోసం బీఎస్పీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, బహుజనులు తదితరులు పాల్గొన్నారు.
Views: 6
Tags:
About The Author
Latest News
01 Oct 2026 22:42:23
*breaking news* *త్రినేత్ర ట్రూత్‌లైన్ - పత్రిక / న్యూస్* * నల్గొండలో దారుణ హత్య* *ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ నల్గొండ పట్టణం.* *కళ్లలో కారం చల్లి.....
