దళిత మహిళపై దాడి.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి

దళిత మహిళపై దాడి.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి

దళిత మహిళపై దాడి.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి


అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లెంల సందీప్


నల్లగొండ టౌన్, అక్టోబర్ 5 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): పీకే మల్లేపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో దళిత మహిళపై దాడి జరిగిందని ఆరోపిస్తూ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లెంల సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభలో మాజీ సర్పంచ్ కొప్పోలు అమర్నాథ్ గౌడ్ అదే గ్రామానికి చెందిన దళిత మహిళ గనిపల్లి మాధవిని అసభ్య పదజాలంతో దూషించి చేయి చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం నిర్వహించిన గ్రామసభలో మహిళపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. దళిత మహిళపై దాడి ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించే అంశాలను పరిశీలించి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరారు. బాధితురాలికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పుల్లెంల సందీప్ హెచ్చరించారు.

Views: 5
Tags:

About The Author

Related Posts