25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
On
గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
చిన్న కంజర్లలో ప్రత్యేక పూజలు, అన్నదానం
పఠాన్‌చెరు, సెప్టెంబర్ 25 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): పఠాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి ఇంద్రేశం మున్సిపాలిటీ చిన్న కంజర్ల 1వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు.
కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 1
Tags:
About The Author
Latest News
01 Oct 2026 22:42:23
*breaking news* *త్రినేత్ర ట్రూత్‌లైన్ - పత్రిక / న్యూస్* * నల్గొండలో దారుణ హత్య* *ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ నల్గొండ పట్టణం.* *కళ్లలో కారం చల్లి.....
