27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం
తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం: సాదుల పవన్‌కుమార్
నంగునూరు, సెప్టెంబర్ 27 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శమని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్‌కుమార్ అన్నారు.
నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు, పద్మశాలి సమాజ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న బాపూజీ అనంతరం తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని పవన్‌కుమార్ గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో దాసరి రామలింగం, సాదుల చంద్రశేఖర్, దాసరి రవి, కారంపూరి శ్రీనివాస్, బింగి రవీందర్, బొజ్జ మహేష్, ఆనందాస్ విష్ణుమూర్తి, దాసరి మల్లేశం, కారంపూరి రామచంద్రం, ఆరగొండ శశి, పోతన వినోద్, దికొండ భాను, దాసరి వినయ్, దాసరి శేఖర్, వేముల ప్రశాంత్, గాజర్ల సిద్దు, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
