25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS

గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

చిన్న కంజర్లలో ప్రత్యేక పూజలు, అన్నదానం

పఠాన్‌చెరు, సెప్టెంబర్‌ 25 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి): పఠాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో అంబేద్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి ఇంద్రేశం మున్సిపాలిటీ చిన్న కంజర్ల 1వ వార్డు కౌన్సిలర్‌ మల్లేపల్లి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు.

కార్యక్రమంలో అంబేద్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

Latest News

01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS 01/10/2026 THRINETHRA TRUTHLINE NEWSPAPER/DIGITAL NEWS
*breaking news*   *త్రినేత్ర ట్రూత్‌లైన్ - పత్రిక / న్యూస్*   * నల్గొండలో దారుణ హత్య* *ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ నల్గొండ పట్టణం.*   *కళ్లలో కారం చల్లి.....
30/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
తూనీకలు… కందిరీగలై పీడిస్తున్నాయా?
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
27/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS
25/09/2026 THRINETHRA TRUTHLINE NEWS PAPER/ DIGITAL NEWS